1/3కప్పు లేదా 50 గ్రాములుపచ్చి బఠానీ కచ్చాపచ్చా గా రుబ్బినది
¼కప్పు లేదా 30 గ్రాములుఫ్రెంచ్ బీన్స్ సన్నగా తరిగినది
¼కప్పు లేదా 30 గ్రాములుక్యాప్సికం సన్నగా తరిగినది
1tbspరెడ్ చిల్లీ పేస్ట్
ఉప్పు తగినంత
3 లేదా 4tbspకార్న్ ఫ్లోర్
3 లేదా 4tbspమైదా పిండి
చిటికెడు రెడ్ ఫుడ్ కలర్
1tspఅల్లం తరుగు
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
మంచూరియా కొరకు
1tbspఅల్లం తరుగు
1tbspవెల్లుల్లి తరుగు
కొద్దిగా ఉప్పు
2 లేదా 3tspనూనె
1tbspకార్న్ ఫ్లోర్/మొక్కజొన్న పిండి
1tspకారం
1కప్పు లేదా 250 mlనీళ్ళు
1/3కప్పు లేదా 30 గ్రాములుఉల్లి కాడ మొదలు తరుగు
1tbspవెనిగర్
2tbspచిల్లీ సాస్
1tbspడార్క్ సోయా సాస్
1tspమిరియాల పొడి
2tbspఉల్లి కాడ తరుగు
Instructions
వెజ్ బాల్స్ తయారీ విధానం
ఒక మిక్సింగ్ బౌల్ లో సన్నగా తరిగిన అన్ని కూరగాయలు, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, అల్లం తరుగు వేసి బాగా కలపాలి.
ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
వేయించుట
ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ ను వేసి చక్కని నారింజ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి పేపర్ నాప్కిన్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
వెజ్ మంచూరియా తయారీ
1 tbsp కార్న్ ఫ్లోర్ లో పావు లీటరు నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్ లో నూనె వేసి కాగాక అందులో అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లి కాడ మొదలు తరుగు, క్యాప్సికం తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, వెనిగర్, డార్క్ సోయా సాస్ వేసి కలపాలి.
కార్న్ స్టార్చ్ కూడా వేసి బుడగలు వచ్చే వరకు ఉడికించాలి.
అందులో వేయించి పెట్టుకున్న వెజ్ బాల్స్ వేసి 3 నుండి 5 నిమిషాల పాటు లేదా మంచూరియన్ గ్రేవీ డ్రై అయ్యే వరకు వేయించాలి.
ఉల్లి కాడల తరుగు పైన చల్లి స్టవ్ కట్టేసి వేడిగా సర్వ్ చేయాలి.